: క్యూరియాసిటీ రోవర్ లో సాంకేతిక లోపం.. సమాచార సేకరణకు అంతరాయం
అరుణ గ్రహంపై నీటి జాడలు, వాతావరణం, శిలల స్వభావం వంటి పలు అంశాల నిగ్గు తేల్చేందుకు అమెరికా ప్రయోగించిన క్యూరియాసిటీ రోవర్ లో సాంకేతిక వైఫల్యం చోటు చేసుకుంది. దీంతో, క్యూరియాసిటీ రోవర్ ప్రధాన విధులైన ఫొటోలు పంపడం, సమాచార విశ్లేషణ వంటి కార్యకలాపాలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది.
ప్రస్తుతం నాసా భూమిపై నుంచే మరమ్మతులు చేపట్టింది. జెట్ ప్రొపల్షన్ ప్రయోగశాల నుంచి రోవర్ కు ఆదేశాలు పంపింది. లోపం తలెత్తిన 'ఎ' కంప్యూటర్ నుండి అన్ని కార్యకలాపాల పర్యవేక్షణను 'బి' కంప్యూటర్ కు బదలాయించింది. గత ఏడునెలల కాలంలో రోవర్ ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య ఇదేనని క్యూరియాసిటీ రోవర్ ప్రాజెక్టు మేనేజర్ రిచర్డ్ కుక్ వెల్లడించారు.