: శంషాబాద్ విమానాశ్రయంలో 3 కిలోల బంగారం పట్టివేత
శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణీకుల నుంచి అక్రమంగా తరలిస్తున్న 3 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వస్తున్న దంపతుల నుంచి 2 కిలోల బంగారాన్ని, సింగపూర్ నుంచి వస్తున్న ప్రయాణీకుడి నుంచి కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.