: నాలుగు ప్రాజెక్టులు... మూడు కోట్ల చొప్పున బహుమతులు
దేశాన్ని మెరుగైన స్థితిలో నిలిపేందుకు ఈ ఏడాది ఆగస్టులో స్వచ్ఛంద సంస్థల నుండి కొత్త ఆలోచనలను గూగుల్ సంస్థ ఆహ్వానించింది. ఇందుకు బాగానే స్పందన లభించింది. సాంకేతికతను ఉపయోగించి దేశాన్ని మెరుగైన స్థితిలో నిలిపేందుకు ఉద్దేశించి గూగుల్ సంస్థ నిర్వహించిన పోటీకి వచ్చిన ఆలోచనల్లో పదింటిని తుది దశకు ఎంపిక చేశారు. వీటిలో నాలుగు ప్రాజెక్టులను ఎంపిక చేసి ఒక్కోదానికి రూ.3 కోట్ల చొప్పున నగదు బహుమతి ఇస్తారు. ఈ పోటీకి గ్రామీణ విద్య, వ్యవసాయం, పారిశుద్ధ్యం, వ్యర్ధాల నిర్వహణ తదితర అంశాలకు సంబంధించిన ప్రాజెక్టు ఆలోచనలతో ఎంట్రీలొచ్చాయి. ఈ ఎంట్రీల్లో విజేతలకు రూ.3 కోట్ల గ్లోబల్ ఇంపాక్ట్ అవార్డు ఇవ్వడమేకాదు వారి ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేలాగా గూగుల్ సహకరిస్తుంది.