: ఎంపీ సాయిప్రతాప్ మరోసారి..
రాష్ట్ర సమైక్యతకు మద్దతుగా రాజీనామా లేఖలు సమర్పించినా అవి స్పీకర్ తిరస్కరణకు గురవడంతో సీమాంధ్ర ఎంపీలు మరో ప్రయత్నానికి తెరదీశారు. తాజాగా మళ్ళీ రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే లగడపాటి, ఉండవల్లి తమ రాజీనామా లేఖలను లోక్ సభ సెక్రటరీ జనరల్ కు సమర్పించగా.. కడప జిల్లా రాజంపేట ఎంపీ సాయిప్రతాప్ కూడా వారి బాటలోనే నడిచారు. తన రాజీనామా లేఖను ఈ మధ్యాహ్నం లోక్ సభ సెక్రటరీ జనరల్ కు అందజేశారు.