: ఆయనకి జాతీయస్థాయికి ఎదిగే సత్తా లేదు: మోడీపై కాంగ్రెస్ ఎదురుదాడి


బీజేపీ జాతీయ సమావేశాల్లో కటువైన పదజాలంతో విరుచుకుపడిన గుజరాత్ సీఎం నరేంద్ర మోడీకి కాంగ్రెస్ దీటుగా బదులిచ్చింది. మోడీకి జాతీయ స్థాయికి ఎదిగే సామర్థ్యం లేదని విమర్శించింది. ఈ ఉదయం మోడీ ..  ప్రధాని మన్మోహన్ తో పాటు నెహ్రూ- గాంధీ కుటుంబంపైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన కొద్ది గంటల వ్యవధిలోనే కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది.

మోడీ ఉపయోగిస్తున్న భాష ఏ జాతీయ స్థాయి నాయకుడు మాట్లాడరని కేంద్ర మంత్రి రాజీవ్ శుక్లా అన్నారు. మోడీ ఇంకా జాతీయ స్థాయి సాధించాల్సి ఉందని శుక్లా అభిప్రాయపడ్డారు. సొంత డబ్బా కోసం కోట్లు కుమ్మరిస్తున్న మోడీని ఎవరైనా జాతీయ నాయకుడని పొరబడితే తప్పులో కాలేసినట్టే అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, జాతీయ సమావేశాల్లో మోడీ తన ప్రసంగంలో ఈరోజు ప్రధానిని నైట్ వాచ్ మన్ తో పోల్చిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News