: వివాదంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్!
గత కొన్నేళ్లుగా వివాదాలకు దూరంగా ఉంటున్న బాలీవు్డ్ హీరో సల్మాన్ ఖాన్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. బాంద్రా సబర్బన్ ప్రాంతంలో విలాసవంతమైన భవంతిలో నివాసం ఉండే సల్మాన్ ఖాన్.. ఇప్పుడు అక్కడి మత్స్యకారుల పాలిట విలన్ లా కనిపిస్తున్నాడు!.
ఆ విల్లాకు అడ్డుగా మత్స్యకారులు వలలు, పడవలు అడ్డుగా పెడుతున్నారని, అందుకే సల్మాన్ సముద్రం అందాలను సరిగ్గా వీక్షించలేకపోతున్నారని ఆయన అంగరక్షకులు ఆ జాలర్లను తరచూ బెదిరిస్తున్నారట. దీంతో విసిగిపోయిన ఆ బెస్తవాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.