: వైద్యం కోసం వస్తే ఆసుపత్రి సిబ్బంది అత్యాచారం
కూతురి వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చింది ఆ తల్లి. కానీ, అక్కడి సిబ్బంది ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. మధ్యప్రదేశ్ లోని హోషంగాబాద్ లో ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిందీ ఘోరం. వారం క్రితం చికిత్స కోసం కుమార్తెను ఆసుపత్రిలో చేర్చగా.. తల్లి కూడా అక్కడే సాయంగా ఉంటోంది. రాత్రివేళ వార్డుబోయ్, సెక్యూరిటీ గార్డు ఆమెను బలవంతంగా సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న భవనంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. జరిగిన దారుణం గురించి ఆమె భర్తకు చెప్పింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు.