: బంగ్లాదేశ్ లో చల్లారని హింసాగ్ని.. 65కి చేరిన మృతులు
బంగ్లాదేశ్ అట్టుడికిపోతోంది. జమాతే-ఈ-ఇస్లామీ నేత దెల్వర్ హుస్సేన్ కు యుధ్ద నేరాల కేసులో కోర్టు మరణ శిక్ష విధించడంతో చెలరేగిన హింస నేటికి 65 మందిని పొట్టనబెట్టుకుంది. హుస్సేన్ కు ఉరి శిక్ష విధించడంతో బంగ్లా వీధులన్నీ ఇస్లామిక్ వాదులతో నిండిపోయాయి. ప్రభుత్వం పారా మిలిటరీ దళాలను రంగంలోకి దింపడంతో నిరసన కారులు మరింత రెచ్చిపోయారు.
దీంతో, పోలీసు కాల్పులు చోటు చేసుకున్నాయి. కాగా, ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. బంగ్లా ప్రతిపక్ష నేత బేగం ఖలీదా జియాల భేటీ వాయిదాపడింది. తాజా హింస నేపథ్యంలోనే ఈ సమావేశం వాయిదా పడిందని భావిస్తున్నారు.