: విభజనకు అనుకూలంగా ఓటేస్తానంటున్న పనబాక


విభజన ప్రకటన వెలువడిన నాటి నుంచి.. రాష్ట్రం విడిపోవడం ఖాయమని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి ఘంటాపథంగా చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె తాజాగా మాట్లాడుతూ.. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు కాంగ్రెస్ విప్ జారీ చేస్తే విభజన తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తానని ప్రకటించారు. అయితే, వ్యక్తిగతంగా తాను సమైక్యవాదినేనని చెప్పారు. కాగా, భద్రాచలాన్ని సీమాంధ్రకే చెందేలా రాష్ట్ర విభజనపై ఏర్పాటుచేసిన కేంద్ర మంత్రుల కమిటీకి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. విభజనకు సీమాంధ్ర ప్రజలు మానసికంగా సిద్ధపడాలని కోరారు. విభజనపై బీజేపీ రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తోందని పనబాక విమర్శించారు.

  • Loading...

More Telugu News