: సొంత పార్టీనే మోసం చేసేవారు కాంగ్రెస్ లో ఉన్నారు : ఆమోస్
ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీనే మోసం చేసే ఘనులు సీమాంధ్ర కాంగ్రెస్ నేతల్లో ఉన్నారని ఎమ్మెల్సీ ఆమోస్ విమర్శించారు. గతంలో చంద్రబాబును ఎదుర్కోవడానికి తెరాసతో పొత్తుపెట్టుకోమని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ప్రాధేయపడ్డారని... ఇప్పుడు వారే విభజనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్ తో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆమోస్ స్పష్టం చేశారు.