: బాబును కలిసిన బాలకృష్ణ


ప్రస్తుతం కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని ఆయన వియ్యంకుడు, సినీ నటుడు బాలకృష్ణ ఈరోజు కలిశారు. బాలకృష్ణ.. రేపు తన అమ్మమ్మ ఊరైన కొమరవోలు నుంచి పాదయాత్రలో పాల్గొననున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో నిన్నస్వగ్రామం నిమ్మకూరు చేరుకున్న బాలకృష్ణ నేడు కపిలేశ్వరపురం వద్ద విశ్రాంతి తీసుకుంటున్న బాబుతో భేటీ అయ్యారు. బాబును కలిసిన సమయంలో బాలకృష్ణ వెంట గుడివాడ టీడీపీ ఇన్ చార్జ్ రావి వెంకటేశ్వరరావు కూడా ఉన్నారు. ప్రస్తుతం బాబు వెంట ఆయన భార్య లోకేశ్వరి, కుమారుడు లోకేశ్ ఉన్నారు. 

  • Loading...

More Telugu News