: రూ. 34లక్షలు పలికిన ల్యాండ్ లైన్ ఫ్యాన్సీ నంబర్


3జీ, 4జీ రోజులివి... ల్యాండ్ లైన్ మూగబోతున్న రోజులు. అయినా, ఓ వ్యక్తి బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ ఫ్యాన్సీ నంబర్ కోసం 34 లక్షల రూపాయలు చెల్లించేందుకు ముందుకు వచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తాడు. చెన్నైలో బీఎస్ఎన్ఎల్ ఫ్యాన్సీ నంబర్లను వేలం వేసింది. నంబర్ 20002000. కొడంబాక్కమ్ ప్రాంతానికి చెందిన రవి ట్రావెల్స్ అనే క్యాబ్ ఆపరేటర్ కు ఇది బాగా నచ్చింది. కస్టమర్లు సులువుగా గుర్తు పెట్టుకుని కాల్ చేస్తారని భావించి ఏకంగా 33.93లక్షలకు కోట్ చేసి ఖాయం చేసుకున్నాడు.

  • Loading...

More Telugu News