: కొంపముంచిన ఇషాంత్.. పసలేని బౌలింగ్ తో ఆసీస్ కు విజయం


మోహాలీలో నిన్న భారత్ ఆసీస్ మధ్య జరిగిన మూడో వన్డేలో ఫలితం చిత్ర విచిత్రంగా మారిపోయింది. ఊహించని మలుపుల మధ్య భారత్ ఓడిపోయింది. కాదు కాదు, భారత్ ఆసీస్ ను గెలిపించింది. అదీ కాదు, ఇషాంత్ తన పసలేని బౌలింగ్ తో ఆసీస్ కు విజయాన్ని అందించాడు. ధోనీ ఒంటిచేతి పోరాటం ఇషాంత్ బౌలింగ్ వల్ల ఫలితం లేకుండా పోయింది. కోట్లాది మంది భారతీయులు ఇషాంత్ ను తిట్టుకుని ఉంటే.. కోట్లాది మంది ఆస్ట్రేలియన్లు ఇషాంత్ ను స్మరించుకుని ఉంటారు. థాంక్స్ చెప్పుకుని ఉంటారు.

ట్యాస్ గెలిచిన ఆసీస్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ధావన్(8), రోహిత్(11), రైనా(17), జాన్సన్(0) వరుసగా పెవిలియన్ క్యూ కట్టారు. 76 పరుగులకే 4 వికెట్లను భారత్ కోల్పోయింది. కోహ్లీ, ధోనీ ద్వయం ఇన్నింగ్స్ ను లైన్లో పెట్టారు. అంతలోనే కోహ్లీ, జడేజా అవుటయ్యారు. 31.3ఓవర్లకు భారత్ స్కోరు 154/6. ధోనీ ఒక్కడే క్రీజులో నిలదొక్కుకుని 139 పరుగులు(నాటౌట్)తో భారత స్కోరును 303కు తీసుకెళ్లాడు.

304 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను భౌరత బౌలర్లు ఇషాంత్ తప్ప ఆసీస్ ను కట్టడి చేశారు. దీంతో 47 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోరు 260/4. మిగిలింది 18 బంతులు. కానీ 44 పరుగులు కావాలి. ఇక ఆసీస్ పనైపోయిందని అందరూ భావించారు. భారత అభిమానుల్లో ఉత్సాహం నిండుకుంది. క్రీజులో ఆసీస్ బౌలర్ ఫాల్క్ నర్ బ్యాట్ పట్టుకుని ఉన్నాడు. ధోనీ ఇషాంత్ కు బౌలింగ్ ఇచ్చాడు. అంతే 4, 6, 6, 2, 6, 6 ఓవర్ అయి పోయే సరికి ఫాల్క్ నర్ 30 పరుగులు పిండుకున్నాడు. లక్ష్యం 12 బంతులకు 14 పరుగులకు తగ్గిపోయింది. ఇంకేముంది, రెండు బంతులు మిగిలి ఉండగానే ఆసీస్ జై కొట్టింది. ఒక నిర్ణయం భారత తలరాతను మార్చేసింది. అయితే తన నిర్ణయాన్ని ధోనీ సమర్థించుకున్నాడు. ఇషాంత్ కు బౌలింగ్ ఇవ్వడం మినహా తనకు మరో ఆప్షన్ లేదని సెలవిచ్చాడు.

  • Loading...

More Telugu News