: మంగళవారం ఢిల్లీకి గవర్నర్: రాష్ట్ర విభజనపై కీలక చర్చలు


రాష్ట్ర గవర్నర్ నరసింహన్ మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయనకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా గవర్నర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన నాలుగురోజులపాటు అక్కడే ఉంటారని సమాచారం. రాష్ట్ర విభజనపై ప్రధాని మన్మోహన్ సింగ్ యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కేంద్ర మంత్రులు షిండే తదితరులతో కీలక చర్చలు జరపనున్నారని తెలుస్తోంది. శుక్రవారం తిరిగి ఆయన హైదరాబాద్ చేరుకుంటారు.

  • Loading...

More Telugu News