: విభజన అంశంపై రెండువేల ఈ-మెయిళ్లు వచ్చాయి: షిండే


రాష్ట్ర విభజన అంశంపై రెండువేల ఈ-మెయిళ్లు వచ్చాయని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. వీటి ద్వారా పలు సూచనలు వచ్చాయన్నారు. మెయిళ్ల పరిశీలనకు సమయం పడుతుందని.. వాటిని ఏపీ, కేంద్ర అధికారులు కలిసి క్రోడీకరిస్తారని చెప్పారు. విభజన అంశంపై ఆంధ్రప్రదేశ్ అన్ని విభాగాల నుంచి వివరణాత్మకమైన నివేదికలు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. వచ్చేనెల ఏడవ తేదీన మంత్రుల సమావేశం జరుగుతుందని సమావేశం అనంతరం మీడియాకు షిండే వెల్లడించారు. కాగా, అనారోగ్యంతో ఈసారి కూడా మంత్రి ఏకే ఆంటోని హాజరుకాలేదు.

  • Loading...

More Telugu News