: స్పోర్ట్స్ అకాడెమీ, అత్యున్నత పాఠశాల నిర్మాణమే నా లక్ష్యం : వీవీయస్ లక్ష్మణ్


త్వరలోనే అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యా సంస్థను, స్పోర్ట్స్ అకాడెమీని స్థాపిస్తానని భారత మాజీ క్రికెటర్ వీవీయస్ లక్ష్మణ్ తెలిపాడు. కోయంబత్తూరులోని ఒక ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ విద్యార్థులతో ముచ్చటిస్తూ లక్ష్మణ్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. తన స్పోర్ట్ అకాడెమీలో అన్ని ఆటలకు స్థానం ఉన్నా క్రికెట్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని అన్నాడు. మనిషి వ్యక్తిత్వ వికాసానికి ఆటలు తోడ్పడుతాయని లక్ష్మణ్ తెలిపాడు. తాను ప్రారంభించబోయే పాఠశాలలో అన్ని మౌలిక వసతులు ఉంటాయని అన్నాడు. ప్రతి ఒక్కరూ చిన్న వయసు నుంచే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించాడు. తన అభిమాన నాయకుడు మహాత్మా గాంధీ అని తెలిపాడు. సచిన్ లో కూడా మహాత్ముడిలో ఉన్న సామర్థ్యం, సమ్మోహన శక్తి ఉన్నాయని కొనియాడాడు.

  • Loading...

More Telugu News