: ఇటలీ మాజీ ప్రధానిపై నిషేధం
పన్ను ఎగవేత కేసులో ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీకి మిలన్ కోర్టు కఠిన శిక్షను విధించింది. ఆయన రెండేళ్లపాటు బహిరంగ ప్రదేశాల్లో కనపడకుండా నిషేధాన్ని విధించింది. అయితే కోర్టు నిర్ణయం వెంటనే అమల్లోకి రాదు. ప్రస్తుతం సెనేటర్ గా ఉన్న బెర్లుస్కోనీని సెనేట్ నుంచి నిషేధించాలంటే పార్లమెంట్ లోని ఎగువసభలో ఓటింగ్ జరగాల్సి ఉంటుంది. ఈ ఓటింగ్ వచ్చే నెల ఉండొచ్చని సమాచారం.
ఈ కేసులో బెర్లుస్కోనీకి ఒక ఏడాది నుంచి మూడేళ్ల వరకు నిషేధం విధించడానికి అవకాశం ఉంది. కానీ, కోర్టు రెండేళ్ల నిషేధం విధించడంతో దాన్ని ఒక్క ఏడాదికి తగ్గించాలని బెర్లుస్కోని తరపు న్యాయవాది కోరారు. అయితే, కోర్టు దీనికి సమ్మతించలేదు. నిషేధ సమయంలో ఆయన గృహ నిర్బంధంలో కాని, కమ్యూనిటీ సర్వీస్ లో కాని ఉంటారు.