: సైనికులకు లభిస్తున్న గౌరవం పోలీసులకు దక్కడం లేదు : అనురాగ్ శర్మ
విధి నిర్వహణలో ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న పోలీసులకు, సైనికులకు దక్కుతున్నంత గౌరవం దక్కడంలేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ ఘటనల్లో 576 మంది పోలీసులు ప్రాణాలను అర్పించారని అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన 'ఓపెన్ హౌస్'ను అనురాగ్ శర్మ ప్రారంభించారు.