: యూపీ మళ్లీ ప్రధాన మంత్రులను అందించే రాష్ట్రం ఎప్పుడవుతుంది?
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. రాజకీయంగా దేశ పాలనా రంగంపై గణనీయ ప్రభావం చూపించే రాష్ట్రం. ఈ రాష్ట్రం దేశానికి ఎనిమిది మంది ప్రధాన మంత్రులను అందించింది. అదే సమయంలో ఈ రాష్ట్రం నుంచి భారత క్రికెట్ జట్టులో ఇద్దరికి మాత్రమే చోటు ఉండేది. 2000 వరకూ ఇదే పరిస్థితి. ఇదంతా గతం. ఇప్పుడు క్రికెటర్ల సంఖ్య 11కు చేరుకుంది. ప్రధానమంత్రుల సంఖ్య 8 దగ్గరే ఆగింది. అదే ఉల్టా అంటే!
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 50 ఏళ్ల కాలంలో 13 మంది ప్రధానులకుగాను ఎనిమిది మంది యూపీ వారే. జవహర్ లాల్ నెహ్రూ(ఫుల్పూర్), లాల్ బహదూర్ శాస్త్రి(అలహాబాద్), ఇందిరాగాంధీ(రాయ్ బరేలి), చరణ్ సింగ్(భాగ్ పట్), రాజీవ్ గాంధీ(అమేథీ), వీపీ సింగ్, చంద్రశేఖర్ (బల్లియా), అటల్ బీహారీ వాజపేయి(లక్నో) వీరంతా ప్రధానులుగా పనిచేశారు. క్రికెటర్ల విషయానికొస్తే పిరోజ్ పాలియా, గోపాల్ శర్మ, మొహమ్మద్ కైఫ్, సురేష్ రైనా, రుద్రప్రతాప్ సింగ్, పీయూష్ చావ్లా, ప్రవీణ్ కుమార్, భువనేశ్వర్ కుమార్, జ్ఞానేందర్ పాండే, సదీప్ త్యాగి తదితరులు ఉన్నారు. ప్రస్తుతం యూపీ ప్రధానుల కంటే క్రికెటర్లనే ఎక్కువ సరఫరా చేసే రాష్ట్రంగా మారిపోయింది. అయితే, భవిష్యత్తులో రాహుల్ గాంధీ యూపీ తరఫున మరో్ ప్రధాని అవడానికి అధికశాతం అవకాశాలు ఉన్నాయి.