: హిట్లర్ హయాంలో నాజీ క్యాంపులు 7 వేలు కాదు.. 42,500.. !


ప్రపంచంలో పేరెన్నికగన్న నియంతల్లో హిట్లర్ పేరు చెప్పుకోకపోతే పెద్ద పొరబాటే అవుతుంది. ఎందుకంటే, యూదు వ్యతిరేకత నరనరాల్లో నింపుకున్న ఈ నాజీ అధినేత యూరప్ అంతటా తన క్రూరత్వాన్ని చాటాడు. పెద్ద ఎత్తున నిర్బంధ శిబిరాలు ఏర్పాటు చేసి యూదులను చిత్రహింసలకు గురిచేశాడు. అయితే,  అప్పట్లో ఆ శిబిరాల సంఖ్య 7 వేలు అని అంచనా వేశారు. కానీ, తాజాగా ఓ పరిశీలనలో అవి దాదాపు 6 రెట్లు అని వెల్లడైంది.

ఒక్క జర్మనీలోనే కాకుండా ఫ్రాన్స్ నుంచి రష్యా వరకు నాజీ ఏలుబడిలో ఉన్న యూరప్ దేశాలన్నింటా  42, 500 పైగా నిర్బంధ శిబిరాలను నిర్వహించారట. వీటిలో యూదులను కుక్కి పశువుల కంటే హీనంగా ప్రవర్తించేవారని పలు చరిత్రకారుల అధ్యయనాల్లో స్పష్టమైంది కూడా. తాజాగా యూఎస్ హోలోకాస్ట్ మెమోరియల్ మ్యూజియం నిర్భంధ శిబిరాల జాబితా రూపొందించింది. ఈ జాబితా ప్రకారం అందరూ అనుకున్న దానికంటే ఆరు రెట్లు ఎక్కువ నిర్భంధ శిబిరాలు ఉన్నట్టు తేలింది. 

  • Loading...

More Telugu News