: క్రీడా సలహా మండలిలో సచిన్ కు చోటు?
రిటైర్ మెంట్ తర్వాత సచిన్ టెండూల్కర్ కు చోటు ఖరారైనట్లు సమాచారం. కేంద్ర క్రీడాశాఖ అత్యున్నత సలహా మండలిలో సభ్యుడిగా సచిన్ కు చోటు కల్పించాలని ఆ శాఖ భావిస్తోంది. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంది. ఈ సలహా మండలిలో భిన్న రంగాలకు చెందిన నిష్ణాతులకు చోటు కల్పిస్తుంటారు. దీనికి క్రీడా మంత్రి అధినేతగా ఉంటారు. క్రీడలకు సంబంధించిన నూతన విధానాలలో అత్యాధునిక, సరికొత్త టెక్నిక్ లను ప్రవేశపెట్టేందుకు వీలుగా ఈ మండలి సూచనలు చేస్తుంటుంది. సచిన్ తోపాటు, బ్యాడ్మింటన్ ఏస్ ప్రకాశ్ పదుకొనే లను సలహా మండలిలో సభ్యులుగా చేర్చుకోవాలని క్రీడాశాఖ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.