: పుజారా, విజయ్ హాఫ్ సెంచరీలు.. చెమటోడ్చుతున్న ఆసీస్


హైదరాబాద్ టెస్టులో భారత్ నిలకడగా ఆడుతోంది. ఓపెనర్ సెహ్వాగ్ (6) స్వల్ప స్కోరుకే అవుటైనా మరో ఓపెనర్ విజయ్ (67 బ్యాటింగ్), వన్ డౌన్ బ్యాట్స్ మన్ పుజారా (69 బ్యాటింగ్)తో కలసి ఇన్నింగ్స్ ను నడిపిస్తున్నాడు.

ఒక్క వికెట్ సాధించి మురిసిపోయిన ఆసీస్ కు ఆ తర్వాత మరో వికెట్  దక్కలేదు. కంగారూ బౌలర్లు చెమటోడ్చినా రెండో వికెట్ జోడీని విడదీయడంలో సఫలం కాలేకపోయారు. దీంతో డ్రింక్స్ విరామానంతరం వికెట్ నష్టానికి 148 పరుగులు చేసిన భారత్  భారీ స్కోరుకు పునాది వేసుకుంటోంది. 

  • Loading...

More Telugu News