: భారత్-ఆస్ట్రేలియా మూడో వన్డే నేడే
భారత్, ఆసీస్ మధ్య మూడో వన్డే ఈ రోజు జరగనుంది. ఈ మ్యాచ్ కు మొహాలీ ఆథిత్యం ఇవ్వనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.
జైపూర్ లో జరిగిన రెండో వన్డేలో అద్భుత విజయం సాధించిన ధోనీ సేన... ఈ మ్యాచ్ కు రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగబోతోంది. అంతేకాకుండా, ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకుండా మూడో వన్డేలోనూ దూకుడును కొనసాగించాలని టీం ఇండియా భావిస్తోంది. కాగా, రెండో వన్డేలో 360 పరుగుల భారీ స్కోరును సాధించినప్పటికీ, భారత యువ ఆటగాళ్ల ముందు ఆ స్కోరు చిన్నబోవడంతో... ఆస్ట్రేలియా శిబిరంలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. మూడో వన్డేలో మరింత మెరుగ్గా రాణించి భారత్ ను కట్టడి చేస్తామని ఆసీస్ కెప్టెన్ జార్జ్ బెయిలీ తెలిపారు. కాకపోతే, బ్యాటింగ్ విభాగంలో భారత జట్టు ఎంతో బలంగా ఉన్నప్పటికీ... బౌలింగ్ విభాగం అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడం... మన జట్టును కొంత కలవరపరిచే అంశం.