: పట్టాలపై జారి పడినా, ప్రాణాలతో బయటపడ్డాడు
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గోదావరి రైల్వేస్టేషన్లో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు పట్టాలపై జారిపడినప్పటికీ, ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. అతను కింద పడిన వెంటనే గూడ్స్ రైలు రావడంతో, పట్టాల మధ్యలో నిలువుగా పడుకున్నాడు. దీంతో గూడ్స్ రైలు అతని పైనుంచి దూసుకెళ్ళింది. స్వల్ప గాయాలతో అతను ప్రమాదం నుంచి బయటపడ్డాడు.