: ఎఫ్ఐఆర్ లో నా పేరు చేర్చడంపై చిదంబరంతో చర్చించా: బిర్లా
ఎఫ్ఐఆర్ లో తన పేరు చేర్చడంపై ఆర్థిక మంత్రి చిదంబరంతో చర్చించానని ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమార మంగళం బిర్లా తెలిపారు. ఢిల్లీలో చిదంబరాన్ని కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఎఫ్ఐఆర్ లో తన పేరు ఉండడంపై తాను భయాందోళనలు చెందడం లేదని అన్నారు. సీబీఐ కేసు నమోదు చేయడంపై తాను బాధపడడం కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా ఆయనతో చిదంబరం ఏం చెప్పారో మాత్రం వెల్లడించలేదు.