: ప్రధానిపై ఒత్తిడి పెంచుతున్న జయ
శ్రీలంకలో జరిగే కామన్వెల్త్ ప్రభుత్వాధినేతల సదస్సుకు ప్రధాని మన్మోహన్ సింగ్ వెళ్ళరాదని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోరుతున్నారు. వచ్చే నెలలో జరిగే చోగమ్ సదస్సుకు ప్రధాని గైర్హాజరవడం ద్వారా లంకలో తమిళులపై జరిగిన దారుణాలకు తగిన రీతిలో నిరసన తెలిపినట్టవుతుందని జయ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రధాని మన్మోహన్ కు ఆమె ఓ లేఖ రాశారు. ప్రధాని ఆ సదస్సుకు వెళ్ళనందువల్ల శ్రీలంకపై దౌత్యపరంగా ఒత్తిడి పెరుగుతుందని పేర్కొన్నారు. తమిళ మైనారిటీ ప్రజల హక్కుల ఉల్లంఘనను చూస్తూ ఊరుకోబోమని కేంద్రం శ్రీలంకకు స్పష్టం చేయాలని జయ తన లేఖలో కోరారు.