: తెలంగాణ వెనుకబాటుకు పాలకులే కారణం: డీఎస్


తెలంగాణ అభివృద్ధి చెందకుండా వెనుకబాటుకు గురవడానికి పాలకులే కారణమని ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ అన్నారు. ఈ విషయంలో సీమాంధ్ర ప్రజలను తప్పుబట్టాల్సిన అవసరం లేదన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ లో జరిగిన జైత్రయాత్ర సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జై ఆంధ్ర ఉద్యమం తర్వాత ఆరు పాయింట్ల ఫార్ములా తెచ్చారన్నారు. హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణనే కాంగ్రెస్ వాదులంతా కోరుకుంటున్నారని డీఎస్ చెప్పారు.

సోనియా సీమాంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదని, తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే రాగద్వేషాలకు అతీతంగా విభజన నిర్ణయం తీసుకున్నారని వివరించారు. 2004లో విభజనకు ఒప్పుకున్న సీమాంధ్ర నేతలు ప్రజలను మభ్యపెట్టేందుకే ఇప్పుడు మాట మారుస్తున్నారు. మరిప్పుడు ఎవరి కోసం సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు అధిష్ఠానాన్ని ధిక్కరిస్తున్నారని ప్రశ్నించారు. సీమాంధ్రలో కొత్త రాజధాని నిర్మిస్తే ఆ ప్రాంతం కూడా బాగా అభివృద్ధి చెందుతుందని సూచించారు.

  • Loading...

More Telugu News