: తెలంగాణ కంటే రాయలసీమ వెనుకబడి ఉంది: ఎంపీ సాయిప్రతాప్


తెలంగాణ కంటే రాయలసీమే బాగా వెనుకబడిన ప్రాంతమని కాంగ్రెస్ ఎంపీ సాయిప్రతాప్ అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, తాము ఒత్తిడికి లోనయ్యామని స్పీకర్ భావించి ఉండవచ్చని, అందుకే రాజీనామాలు తిరస్కరించి ఉంటారని అన్నారు. కానీ, ఉద్యమకారులు మాత్రం ఎంపీలు నాటకాలాడుతున్నారని భావిస్తున్నారని తెలిపారు. దేశంలో అభివృద్ధి పరంగా మన రాష్ట్రం 4వ స్థానంలో ఉందని, విభజన జరిగితే తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని అన్నారు. ఒకప్పుడు రాయలు ఏలిన సీమ ఇప్పుడు కరవు సీమగా మారిందని, తీవ్రంగా వెనుకబడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన చేయకుండా, వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 101(3)(బి) నిబంధన క్రిందే తమ రాజీనామాలు ఆమోదించాలని కోరామని, అయితే అది జరగలేదని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News