: ఒక ర్యాంకు జారిన పుజారా
భారత్ యువ సంచలనం చటేశ్వర్ పుజారా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో ఎనిమిదో స్థానానికి పడిపోయాడు. ఈ సౌరాష్ట్ర బ్యాట్స్ మన్ ఐసీసీ తాజా బ్యాటింగ్ ర్యాంకుల్లో ఓ స్థానం దిగజారాడు. ఇక, బౌలింగ్ విభాగంలో ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎనిమిదోస్థానంలో కొనసాగుతున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టాప్-10లో నిలిచిన భారత క్రికెటర్లు వీరిద్దరే. బ్యాటింగ్ అగ్రస్థానంలో సఫారీ ఓపెనర్ హషీమ్ ఆమ్లా, బౌలింగ్ విభాగంలో టాపర్ గా సఫారీ పేసర్ డేల్ స్టెయిన్ కొనసాగుతున్నారు. ఇక, నెంబర్ వన్ టెస్టు జట్టుగా దక్షిణాఫ్రికా తన అగ్రపీఠాన్ని పదిలపరుచుకుంది.