: బీరు కోసం భారతీయుల నెట్ శోధన


భారత నెటిజన్లు ఆల్కహాల్ కోసం ఆన్ లైన్లోనూ విరివిగా శోధిస్తున్నారు. గూగుల్ సెర్చ్ అధ్యయనం ప్రకారం గత మూడు నెలల కాలంలో నెటిజన్లు శోధిస్తున్న ఆల్కహాల్ బ్రాండ్లలో బీరే ముందుందట. దేశంలో ఆల్కహాల్ కోసం ఆన్ లైన్ వేట కర్ణాటక రాష్ట్రంలో అత్యధికంగా సాగుతోందని వెల్లడైంది. దీని తర్వాత హర్యానా, మహారాష్ట్ర ఉన్నాయి.

విస్కీ, రమ్, వైన్ కోసం సెర్చ్ చేస్తున్న సిటీలలో ముంబై మొదటి స్థానంలో, బెంగళూరు రెండో స్థానంలో ఉన్నాయి. కర్ణాటకలో నెటిజన్లు విస్కీ, రమ్ కోసం శోధిస్తుండగా, హర్యానాలో వైన్, బీర్ కోసం, మరాఠీలు వోడ్కా కోసం వెతుకుతున్నారు. అయితే, ప్రపంచంలో టాప్ 30 దేశాలలో చూస్తే బీరు వినియోగం పరంగా భారత్ దిగువ స్థానంలో ఉందని బీరోనామిక్స్-2013 పేర్కొంది.

  • Loading...

More Telugu News