: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు ఎదురు గాలి వీస్తోంది: అరుణ్ జైట్లీ


పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో... రాజకీయ పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. విమర్శలకు పదును పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ తనదైన శైలిలో కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని... ఆ పార్టీ దుకాణం మూసుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. 1977, 1989 ఎన్నికల ఫలితాలు పునరావృతమవుతాయని జోస్యం చెప్పారు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో మంచి రికార్డు ఉన్న ప్రభుత్వాలు సైతం కుప్పకూలిపోయాయని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా ప్రజలు కాంగ్రెస్ కు సమాధి కట్టాలనుకుంటున్నారని... ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారని జైట్లీ అన్నారు. కాంగ్రెస్ పతనానికి ఆ పార్టీ నేతల అంతులేని అవినీతితో పాటు దిగజారిన దేశ ఆర్థిక పరిస్థితి కూడా కారణమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానిది కావడం వల్ల సరిహద్దుల్లో తీవ్రవాదులు పేట్రేగిపోతున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News