: ఏపీఎన్జీవోలకు దిగ్విజయ్ సింగ్ కృతజ్ఞతలు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హామీతో సమ్మె విరమించిన ఏపీఎన్జీవోలకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. విభజన తర్వాత కూడా తెలంగాణ, సీమాంధ్ర ప్రజల మధ్య సామరస్యం కొనసాగాలని ఆకాంక్షించారు. సీమాంధ్రలో సమస్యలను మంత్రుల బృందం పరిష్కరిస్తుందని భోపాల్లో మీడియా ఎదుట హామీ ఇచ్చారు.