: అమ్మలోని కమ్మదనం..27 ఏళ్లుగా కుమార్తెను మోస్తున్న తల్లి
సృష్టిలో తీయనిపదం అమ్మ.. మనిషితో ఉంటూ అన్ని అవసరాలు కనిపెట్టలేని దేవుడు తనకు ప్రతిరూపంగా అమ్మని పంపాడని అంటారు. అలాంటి అమ్మ నవమాసాలు మోసి ఆ భారాన్ని పుడమిపై పెడుతుంది. కానీ ఈ తల్లి గత 27 ఏళ్లుగా తన కుమార్తెను మోస్తోంది. వరంగల్ జిల్లా గణపురం మండలం నగరంపల్లిలో సరోజ, ఆమె కుమార్తె సరిత నివాసముంటున్నారు. సరితకు చిన్నతనంలోనే కాళ్లు చచ్చుపడిపోవడంతో నడవలేకపోయేది. దీంతో సరిత ఎక్కడికెళ్లినా సరోజ వీపున మోస్తూనే తీసుకెళ్లేది. నేటికీ సరితను వీపున మోస్తూనే సాకుతోంది. ఈ కుటుంబానికి ఆధారం ప్రభుత్వం ఇచ్చే ఫించనే. వచ్చిన ఆ కాస్త రొక్కంతోనే కుటుంబాన్ని ఈడ్చుకొస్తున్నారీ తల్లీ కూతుళ్లు.