: ఈనెల 26న వైఎస్సార్సీపీ 'సమైక్య శంఖారావం' సభ
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ తలపెట్టిన 'సమైక్య శంఖారావం' సభను ఈనెల 26న హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఇందుకు తమకు అనుమతి లభించిందని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ చెప్పారు. ఈ సభకు అందరూ రావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు 19వ తేదీనే సభ నిర్వహించాల్సి ఉండగా అనుకోని కారణాల వల్ల తేదీని మార్చుకున్నారు. తొలుత పోలీసులు సభకు అనుమతి నిరాకరించగా, వైఎస్సార్సీపీ హైకోర్టును ఆశ్రయించడంతో మార్గం సుగమమైంది.