: మీ ఇద్దరి మధ్య ఏముందో ముందు తేల్చండి : సీపీఐ నారాయణ
రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం పార్టీల మధ్య అగాధం పెరుగుతోంది. ఈ రోజు సీపీఎంపై సీపీఐ జనరల్ సెక్రటరీ నారాయణ విరుచుకుపడ్డారు. వామపక్షాల ఐక్యత గురించి మాట్లాడే సీపీఎం... మొదట తన వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. వైఎస్సార్సీపీతో సీట్ల బేరాలు కుదుర్చుకుంటూ ఐక్యత గురించి సీపీఎం మాట్లాడ్డం విడ్డూరంగా ఉందని విమర్శించారు. వైసీపీ, సీపీఎం మధ్య సర్దుబాటు ఏదైనా ఉంటే బహిరంగంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. జగన్ పార్టీకీ తాము దూరమని అన్నారు. ఈ రోజు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ నారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు.