: చైనాలో ఇక వైఫై కాదు.. లైఫై!


వై-ఫై సంకేతాల ద్వారా ఇంటర్నెట్ కు అనుసంధానమయ్యే వ్యవస్థ స్థానంలో చైనా పరిశోధకులు లై-ఫై వ్యవస్థను ఆవిష్కరించారు. వై-ఫైలో రేడియో తరంగాల ద్వారా ఇంటర్నెట్ కు అనుసంధానం ఉంటుంది. కానీ, అంతకు మించిన వేగంతో ఎల్ఈడీ బల్బు ద్వారా అనుసంధానం చేయగలగడమే లై-ఫై ఘనత.

ఒక వాట్ ఎల్ఈడీ బల్బు ద్వారా నాలుగు కంప్యూటర్లు ఇంటర్నెట్ కు అనుసంధానం కావచ్చని షాంఘై ఫుడాన్ వర్సిటీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న చినాన్ తెలిపారు. ఎల్ఈడీ బల్బు ఇంటర్నెట్ సంకేతాలను ప్రసారం చేసే వాహకంగా ఉపయోగపడుంది. బల్బులో ఏర్పాటు చేసిన మైక్రోచిప్ తో సెకనుకు 150 ఎంబీ స్పీడు పొందవచ్చట. చైనాలో సాధారణ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ వేగం కంటే ఇది ఎక్కువని చినాన్ చెప్పారు. లై-ఫై ఆవిష్కరణ బృందానికి చినానే నాయకత్వం వహించారు. భవిష్యత్తులో ఇదెన్ని సంచనాలను సృష్టిస్తుందే చూడాలి.

  • Loading...

More Telugu News