: రాష్ట్రంలో ప్రత్యేక క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు


క్రీడాకారులకు శుభవార్త. రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివేర్శిటీని నెలకొల్పనున్నట్టు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. చండీగడ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ తరహాలో హైదరాబాదులో ఓ క్రీడా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పడానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి తెలిపారు.

అలాగే, రాష్ట్రంలోని ప్రతి మండలంలోనూ 2 కోట్ల 10 లక్షలతో మినీ స్పోర్ట్స్ కమ్ కల్చరల్ స్టేడియాలను నిర్మిస్తామని ఆయన ప్రకటించారు. వచ్చే మూడు నాలుగేళ్ళలో పూర్తయ్యే విధంగా ఇప్పటికే 117 స్టేడియాలను మంజూరు చేసినట్టు ముఖ్యమంత్రి చెప్పారు.      

  • Loading...

More Telugu News