: ఎవరెస్ట్ సమీపంలో విరిగిపడ్డ మంచు చరియలు: నలుగురు మృతి


ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ సమీపంలో మంచు చరియలు విరిగిపడి నలుగురు పర్యాటకులు మృతి చెందారు. చనిపోయిన వారిలో ఒక ఆస్ట్రేలియా జాతీయుడితో సహా ముగ్గురు టిబెట్ పౌరులున్నారు. ఈ వివరాలను చైనా అధికారులు వెల్లడించారు. వీరంతా సరైన అనుమతులు లేకుండానే పర్యటిస్తున్నారని తెలిపారు. ఈ ఘటన గత ఆదివారం జరిగిందని ప్రకటించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు సమీపంలోని బేస్ క్యాంపుల్లో ఉన్న 154 మంది టూరిస్టులను హుటాహుటీన తరలించినట్టు 'జిన్హువా' పత్రిక వెల్లడించింది. ఈ టూరిస్టులను టిబెట్ లోని ఒక ట్రావెల్ ఏజెన్సీ ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఎవరెస్ట్ ప్రాంతానికి తీసుకువచ్చింది.

  • Loading...

More Telugu News