: వాచీలోనే మీ జీవితం సమస్తం


స్మార్ట్‌ ఫోన్‌లు వచ్చిన తర్వాత చాలామంది వాటికి బందీలయిపోయారు. ఏ విషయానికైనా స్మార్ట్‌ ఫోన్‌తోనే పనిబడుతుంది. అలా స్మార్ట్‌ఫోన్‌లు మన జీవితాలతో పెనవేసుకుపోయాయి. ఇప్పుడు చేతి వాచీ కూడా ఇదే పనిచేయడానికి వస్తోంది.

స్మార్ట్‌వాచ్‌ 2 అనే పేరుతో మార్కెట్లోకి రానున్న వాచీ త్వరలోనే మన జీవితాలను తనకు బందీలుగా చేసుకుంటుందంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే ఈ వాచీలో కంప్యూటర్‌ కూడా ఉంటుంది. దీంతో మనతోబాటు కంప్యూటరును తీసుకెళ్లాల్సిన పని ఉండదు. అలాగే అరచేతిని మించిన ఆకారంలో ఉండే స్మార్ట్‌ఫోన్‌లలాగా ఇది పెద్దదిగా కూడా ఉండదు. చక్కగా చేతికి అమరేలా ఉండే ఈ వాచీ ధర మామూలు మధ్యతరగతి వారికి కూడా అందుబాటులో ఉంటుందనే చెప్పవచ్చు. వివిధ రకాల రంగుల్లో లభించే ఈ స్మార్ట్‌వాచీ2 ధర అమెరికాలో 200 డాలర్లు. అంటే రూ.12,400 అన్నమాట. దీన్ని వేర్వేరు ఆండ్రాయిడ్‌ ఫోన్లతో అనుసంధానం చేసుకోవచ్చని కూడా కంపెనీ చెబుతోంది.

  • Loading...

More Telugu News