: జవాను ఫిరోజ్ ఖాన్ మృతిపై సీఎం దిగ్భ్రాంతి


హైదరాబాదీ జవాను ఫిరోజ్ ఖాన్ పాకిస్థాన్ సైన్యం కాల్పుల్లో మరణించడం పట్ల సీఎం కిరణ్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫిరోజ్ ఖాన్ కుటుంబ సభ్యులకు ఆయన తన సంతాపం తెలియజేశారు. కాగా, ఈ రాత్రి 9 గంటలకు ఫిరోజ్ ఖాన్ మృతదేహం హైదరాబాదు చేరుకోనుంది. మద్రాస్ రెజిమెంట్ కు చెందిన ఫిరోజ్ ఖాన్ ఆర్మీలో లాన్స్ నాయక్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. నిన్న జమ్మూకాశ్మీర్లోని బాలాకోట్ సెక్టార్లో జరిగిన కాల్పుల్లో ఈ హైదరాబాదీ వీరమరణం పొందాడు.

  • Loading...

More Telugu News