: న్యూజిలాండ్ యువ రచయిత్రికి 'మ్యాన్ బుకర్ ప్రైజ్'


28 ఏళ్ల యువ రచయిత్రి 'ఎలినార్ క్యాటన్' ను... ప్రతిష్ఠాత్మకమైన 'మ్యాన్ బుకర్ ప్రైజ్' వరించింది. న్యూజిలాండ్ కు చెందిన ఎలెనార్ రచించిన 'ద ల్యూమినరీస్' రచనకుగానూ ఈ పురస్కారం దక్కింది. ఈ విజయంతో ఆమె రెండు రికార్డుల్ని బ్రేక్ చేసింది. పిన్న వయసులో బుకర్ ప్రైజ్ గెలుచుకోవడం ఒకటైతే... బుకర్ ప్రైజ్ గెలుచుకున్న అతి పెద్ద రచన కావడం రెండోది. ఈ నవల ఏకంగా 852 పేజీలు ఉంది. 19వ శతాబ్దంలో న్యూజిలాండ్ నేపథ్యంగా సాగే మర్డర్ మిస్టరీ ఈ నవల ఇతివృత్తం. ఆమెకు ఇది రెండో నవలే కావడం విశేషం. ఎలినార్ పాతికేళ్ల వయస్సులో ఉన్నప్పుడు ఈ నవలను రాయడం మొదలుపెట్టారు.

లండన్ లో జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో 'ద డచెస్ ఆఫ్ కార్న్ వాల్' చేతుల మీదుగా ఎలినార్ బుకర్ ట్రోఫీని అందుకున్నారు. దీంతో పాటు ఆమెకు 50 వేల పౌండ్ల చెక్కును కూడా అందజేశారు.

  • Loading...

More Telugu News