: బూస్ట్ అనుకొని తాగి..మృత్యుముఖానికి దగ్గరయ్యారు
తలకి రంగు కోసం వేసుకొనే హెయిర్ డై పౌడర్ ను బూస్ట్ అనుకుని పొరపాటున పాలలో కలుపుకుని తాగారు కొందరు మహిళలు. ఈ ఘటనలో ఒక మహిళ చనిపోగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తి మండలం చుక్కలనిడుగిల్లు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.