: పరేఖ్ తన అభిప్రాయాలు సీబీఐకి చెప్పుకోవాలి: దిగ్విజయ్ సింగ్
బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్ ఏదైనా చెప్పాలనుకుంటే సీబీఐ ఎదుట చెప్పాలని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ సూచించారు. స్కాంలో తన పేరును చేర్చినప్పుడు ప్రధాని పేరును ఎందుకు చేర్చరని పరేఖ్ ప్రశ్నించడంపై దిగ్విజయ్ పైవిధంగా స్పందించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఎన్డీయే అనుసరించిన విధానం ఆధారంగా బొగ్గుక్షేత్రాల కేటాయింపు జరిగిందని చెప్పారు. ఈ విషయం బీజేపీ గుర్తుంచుకోవాలని డిగ్గీరాజా అన్నారు. ఇక, రాష్ట్ర విభజన అంశంపై ఏర్పాటైన సమన్వయ కమిటీ సమావేశం తుపాను వల్ల వాయిదా పడిందని చెప్పారు.