: ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో నిబంధనలకు నేతల తూట్లు


అధికారం కోసం ఆరాటం. ఆ క్రమంలో ఎన్నికల నియమావళి ఒకటుందని, దాన్ని విధిగా పాటించాలన్న స్పృహ కూడా ఉండడం లేదు నేతలకు. ఢిల్లీ శాసనసభకు వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో పార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇందుకోసం నిబంధనలు మర్చిపోతున్నాయి. ఈ నెల 4 తర్వాత వివిధ పార్టీలపై ఢిల్లీ పోలీసులు 219 కేసులు నమోదు చేశారు. 79 కేసులు కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపైనే నమోదయ్యాయి. బీజేపీపై 53, కాంగ్రెస్ పై 53, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ పై 26 కేసులు బుక్ అయ్యాయి. అనుమతి లేకుండా ర్యాలీల నిర్వహణ, లౌడ్ స్పీకర్లు, వాహనాల వినియోగంపై ఎక్కువ కేసులు ఉన్నాయి.

  • Loading...

More Telugu News