: 19 ఏళ్ల యువతికి ఒకే కాన్పులో నలుగురు


పందొమ్మిదేళ్ళ యువతి ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనివ్వడం విశేషం. కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ పరిధిలో చెలువాంబ ఆసుపత్రిలో ఇది జరిగింది. 19 ఏళ్ల నందిని నలుగురికీ సహజంగా జన్మనివ్వడం అరుదైనదిగా వైద్యులు చెబుతున్నారు. మరో విశేషం ఏమిటంటే వీరిలో ఇద్దరు మగ, మరో ఇద్దరు ఆడ శిశువులు. కోటి మందిలో ఒక్కరు మాత్రమే ఇలా ఒకే కాన్పులో నలుగురికి జన్మనివ్వడం జరుగుతుందట. నందిని భర్త ఒక రైతు. నలుగురినీ చూసుకుని వారిప్పుడు తెగ సంతోషపడిపోతున్నారు.

  • Loading...

More Telugu News