: నక్షత్రాల పుట్టుకను మరింత బాగా తెలుసుకోవచ్చు


పాలపుంతలో కొన్ని ప్రాంతాల్లో జరిగే మార్పులను పరిశీలించడం వల్ల నక్షత్రాల పుట్టుకను గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనం నివశించే పాలపుంతలోనే కొత్త నక్షత్రాలు పుట్టుకొస్తున్నట్టు గమనించి శాస్త్రవేత్తలు ఈ అంశాలను పరిశీలిస్తే నక్షత్రాల పుట్టుకకు సంబంధించిన అంశాలపై పూర్తి అవగాహన పెరుగుతుందని భావిస్తున్నారు.

అరిజోనా విశ్వవిద్యాలయానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనల్లో మన పాలపుంత నక్షత్రమండలంలో కొత్తగా నక్షత్రాలు పుడుతున్న 6,194 ప్రాంతాలను గుర్తించారు. ఈ ప్రాంతాలను పరిశీలిస్తే నక్షత్రాల పుట్టుకకు సంబంధించి మరింత అవగాహన పెరుగుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పటి వరకూ నక్షత్రాల పుట్టుకకు సంబంధించిన అనేక అధ్యయనాలు సాగినప్పటికీ ఒక నక్షత్రం పుట్టడానికి ముందు జరిగే మార్పులను గురించి శాస్త్రవేత్తలకు చాలా తక్కువ సమాచారం తెలుసు. తాము కనుగొన్న సమాచారం ఈ కొరతను తీరుస్తుందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన యాన్సీ షిర్లే చెబుతున్నారు. దీని ద్వారా పాలపుంతలో వేర్వేరు ప్రాంతాల మధ్య ఎలాంటి తేడాలున్నాయి, అవి ఏయే పరిణామదశల్లో ఉన్నాయి? అనే విషయాలను తెలుసుకోవడానికి అవకాశం లభించిందని తెలిపారు. నక్షత్రాలు పుడుతున్నకొద్దీ ఆ ప్రాంతాల్లో జరిగే మార్పులను గురించి ఖగోళ శాస్త్రవేత్తలు ఇప్పుడు మరింత కచ్చితమైన సమాచారాన్ని తెలుసుకోవడానికి వీలవుతుందని షిర్లే చెబుతున్నారు.

  • Loading...

More Telugu News