: భార్య వేరొకర్ని పెళ్లి చేసుకుందని.. మామను చంపిన భర్త
భార్య తననుంచి విడిపోయి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో ఓ వ్యక్తి మామను చంపేశాడు. న్యూఢిల్లీకి చెందిన విక్రమ్ 2009లో సుమన్ ను పెళ్లి చేసుకున్నాడు. తరువాత వారిద్దరూ వ్యక్తిగత కారణాలతో కొన్ని నెలలుగా దూరంగా ఉంటున్నారు. ఆ క్రమంలో సుమన్ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. విషయం తెలిసిన విక్రమ్ జైత్ పూర్ లోని ఆమె కుటుంబ సభ్యులున్న ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్డాడు. దాడిని అడ్డుకునేందుకు వచ్చిన ఆమె తండ్రిని విపరీతంగా గాయపర్చడంతో అతను మృతి చెందాడు. ఈ ఘటనలో సుమన్ తో పాటు ఆమె తల్లి, ఇద్దరు సోదరులు, మరదలు కూడా గాయపడ్డారు.