: అమితాబ్ కు అనారోగ్యం


ఈ మధ్యనే 70 ఏళ్లు పూర్తి చేసుకున్న 'బిగ్ బి' అమితాబ్ బచ్చన్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. ఆయన కడుపు నొప్పి, జ్వరంతో బాధపడుతున్నారు. ఈ వివరాలను ఆయనే స్వయంగా తన బ్లాగ్ ద్వారా వెల్లడించారు. కంగారు పడాల్సినంత పరిస్థితేమీ లేదని... కొద్దిగా విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని తెలిపారు. ఆయన ఈ పరిస్థితుల్లో కూడా 'కౌన్ బనేగా కరోడ్ పతి' షూటింగ్ లో పాల్గొంటున్నారు. దీని గురించి ఆయన వ్యాఖ్యానిస్తూ... బతికినంత కాలం సంఘర్షణ చేయాల్సిందేనని బ్లాగ్ లో వెల్లడించారు.

  • Loading...

More Telugu News