: ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం దిశగా తుపాను
గత పదేళ్లలో వచ్చిన తుపానులన్నింటికన్నా బలమైన తుపాను ఒకటి జపాన్ దిశగా కదులుతున్నట్టు సమాచారం. వైఫా టైఫూన్ గా పేర్కొంటున్న ఈ తుపాను ప్రస్తుతం జపానుకు దక్షిణంగా పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రంవైపు పయనిస్తోందని జపాన్ దేశ వాతావరణ విభాగం ప్రకటించింది. ఇది బుధవారం మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశం ఉందని, దీని ప్రభావంతో భారీవర్షాలు కురుస్తున్నాయని, గత పదేళ్లలో ఇంత శక్తిమంతమైన తుపాను రాలేదని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దీనివల్ల జపానులో రవాణా, కమ్యూనికేషన్ల వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో, జపాన్ ప్రభుత్వం అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.