: శత్రుచర్ల కాన్వాయ్ పై చెప్పులతో దాడి
మంత్రి శత్రుచర్ల విజయరామరాజుకు సమైక్యసెగ తగిలింది. శ్రీకాకుళం జిల్లాలోని ఫైలిన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయనను సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కాన్వాయ్ పైకి చెప్పులు విసిరారు. శత్రుచర్ల రాజీనామా చేయాలని నినదించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిల్లి కృపారాణికి కూడా సమైక్య సెగ తగిలింది. అయితే, ఆమె మాట్లాడుతూ తన రాజీనామాతో విభజన ఆగదని తెలిపారు.